: జమ్మలమడుగులో టీడీపీ కౌన్సిలర్ అదృశ్యం... వైకాపా కిడ్నాప్ చేసిందంటూ టీడీపీ ఆందోళన
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ 1వ వార్డు టీడీపీ కౌన్సిలర్ షేక్ జానీ అదృశ్యమయ్యారు. వైఎస్సార్సీపీ నేతలే జానీని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.