: నేవీలో అధికారుల మధ్య భార్యల మార్పిడి: బయటపెట్టిన ఓ అధికారి భార్య


భారతీయ నేవీలో భార్యల మార్పిడి విధానంపై మరోసారి ఆరోపణలు వెలుగు చూశాయి. ఈసారి ఈ నీచ సంస్కృతిని చూసి తట్టుకోలేని ఒక నేవీ అధికారి భార్య సుమేధ (పేరు మార్చడం జరిగింది) విషయాన్ని బయటపెట్టారు. తన భర్త ఉన్నతాధికారి భార్యతో గడుపుతుండగా చూశానని ఆమె వెల్లడించారు. ''నేను ఉద్యోగంలో ఉండాలనుకుంటే భార్యల మార్పిడిలో నువ్వు కూడా భాగం కావాలి'' అని తనను కూడా బలవంతం చేశాడని సుమేధ తెలిపారు.

''నా భర్త మరో మహిళతో గడుపుతుండగా చూసి కేకలు వేశా. నా భర్తను నిలదీశా. పక్కనున్న మహిళ నన్ను తిట్టడమే కాకుండా కొట్టింది. నోరు మూసుకుని ఉండకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరించింది'' అంటూ 25 ఏళ్ల సుమేధ తన అనుభవాన్ని వెల్లడించింది. నేవీలో 20 నుంచి 30శాతం మంది అధికారులు తమ భార్యలను ఒకరినొకరు మార్పిడి చేసుకుంటున్నారని (వైఫ్ స్వాపింగ్) ఆమె ఆరోపించారు. అక్కడ ప్రతిరోజూ పార్టీలు జరుగుతూనే ఉంటాయన్నారు. భార్యలను మార్చుకోవడం వారికి సర్వసాధారణమని చెప్పారు. ఇంత సంచలన ఆరోపణలు ఎలా చేస్తున్నారని విలేఖరులు అడగగా.. ''నేను చూసింది నాకే తెలుసు. ఐఎన్ఎస్ ద్రోణాచార్య యుద్ద నౌకలో భార్యల మార్పిడి జరుగుతుందని 2011లో ఒక ఫిర్యాదు వచ్చింది. అయితే, నేవీ అధికారులు దానిని సమాధి చేశారు'' అని సుమేధ తెలిపారు.

తన భర్తతో కలిసి సుమేధ కేరళలోని కోచిలో ఉంటున్నారు. గురువారం తన భర్తను వీడి ఢిల్లీకి చేరుకుని జరిగిన దానిని బయటపెట్టారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సుమేధ సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్నారు. మరోవైపు సుమేధ ఆరోపణలను నేవీ ఖండించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని రక్షణమంత్రి ఆంటోనీ ఆదేశించారు.

  • Loading...

More Telugu News