: నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తా: మంత్రి నారాయణ


నెల్లూరును పారిశ్రామిక కారిడార్ గా మారుస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలోని బీజేపీ కార్యాలయానికి నారాయణ విచ్చేశారు. బీజేపీ నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తానని అన్నారు. అనంతరం ఆయన సీపీఐ, సీపీఎం పార్టీ కార్యాలయాలను కూడా సందర్శించారు. ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News