: కేసీఆర్ తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చలు
కరీంనగర్, సిద్ధిపేటలో ఐరన్ ఓర్, పెల్లెట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఎన్ఎస్ఎల్ కన్సాలిడేటెడ్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు. తొలిదశలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ఆస్ట్రేలియా ప్రతినిధులు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన ప్రతినిధులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.