: తృణమూల్ ఎంపీపై కలకత్తా హైకోర్టులో పిల్
'అత్యాచార' అనుచిత వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ పై కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు కోర్టు పిటిషన్ ను పరిశీలించనుంది. సీపీఐ (ఎం) వారు తమ పార్టీ కార్యకర్తల తల్లులు, కుమార్తెలను అవమానిస్తే విడిచిపెట్టనని, తమ పార్టీ వారిని 'మీ ఇళ్లకు పంపి అత్యాచారం చేయిస్తా'నంటూ తపస్ మాట్లాడిన ఓ వీడియో నిన్న (మంగళవారం) పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలువురు మండిపడుతున్నారు.