: ప్రీతీజింటా ఆరోపణలు అసత్యం: నెస్ వాడియా లేఖ
బాలీవుడ్ నటి, మాజీ ప్రియురాలు ప్రీతీజింటా తనపై చేసిన ఆరోపణలు అసత్యమంటున్నారు వ్యాపార వేత్త నెస్ వాడియా. ఈ మేరకు ముంబయి పోలీసులకు ఆయన ఓ లేఖ రాశారు. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్ మధ్య ఆ రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉన్న వక్తుల జాబితాను తెలిపాడు. అందులో తాను చెప్పిన వారంతా సరైన, స్వతంత్రంగా సమాచారం ఇస్తారన్నాడు. ఇదిలాఉంటే, అటు తనకు ప్రియమైన వ్యక్తే తనను వేధించాడని, దూషించాడని ప్రీతీ ఈ రోజు ఫేస్ బుక్ లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.