: తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయండి: మోడీ
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ పరిజ్ఞాన విషయంలో సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కె.షణ్ముగంను కోరారు. ఢిల్లీలో సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన నివాసాల నిర్మాణానికి భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందు షణ్ముగం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిశారు.