: తిరుపతి, వరంగల్ లో అంతర్జాతీయ సదస్సులు:సీఎం


రాష్ట్రంలోని తిరుపతి, వరంగల్ పట్టణాలలోనూ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ లో పర్యాటక సదస్సును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్... చిరంజీవితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు విదేశీయులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News