: భారతీయ సినిమా చరిత్ర 'తగలబడిపోయింది'
చరిత్రపుటలు తిప్పేకొద్దీ ఎన్ని జ్ఞాపకాలో! అన్నీ అపురూపమే. పదిలంగా దాచుకోవాల్సిన వాటిని గోడౌన్లు, వేర్ హౌస్ లలో భద్రపరిస్తే పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ముంబయిలోని 'బాంబే టాకీస్' వేర్ హౌస్ లో గత గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఎన్నో విలువైన సినిమా ప్రింట్లు, పోస్టర్లు, ఆనాటి ఫొటోలు దగ్ధమయ్యాయి. ఇవన్నీ కూడా 1947కి ముందువి కావడమే విచారకరం.
వీటితోపాటు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఠాగూర్ వంటి ప్రముఖుల లేఖలు కూడా మంటలపాలయ్యాయి. వీటిలో రెండో ప్రపంచయుద్ధ సమయంలో జాతీయతత్వం, దేశభక్తి పెంపొందేలా సినిమా తీయాలని 'బాంబే టాకీస్' వ్యవస్థాపకుడు రాజ్ నారాయణ్ దూబేకు నేతాజీ రాసిన లేఖ కూడా ఉందట.