: స్వామి గౌడ్ గొప్ప ఉద్యమకారుడు: టీ డిప్యూటీ సీఎం అలీ
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గా ఎన్నికైన స్వామి గౌడ్ పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రశంసల జల్లు కురిపించారు. స్వామి గౌడ్ ఓ గొప్ప ఉద్యమకారుడని... తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర అమోఘమని చెప్పారు. మండలి ఛైర్మన్ గా ఆయన ఎన్నికవడం సంతోషంగా ఉందని అన్నారు. స్వామి గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.