: చెన్నై భవన ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
చెన్నై శివార్లలోని మౌలివాక్కం ప్రాంతంలో పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతేగాక గాయపడిన వారికి చెన్నైలో ఉచిత వసతి, భోజనం, తిరిగి వచ్చేందుకు ఛార్జీలు కూడా ఇవ్వనున్నామని చెప్పారు. ఈ ఘటన నుంచి మొత్తం 27 మంది గాయాలతో బయట పడ్డారు.