: ఆంధ్రాకు నీళ్లివ్వొద్దని టీఆర్ఎస్ ధర్నా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని విభజనకు ముందు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే పరిస్థితి దాపురించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయవద్దని టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కాగా, జూలై 8 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేంద్ర జలసంఘం అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.