: ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు
ఐపీఎల్ ఆరవ సీజన్ రోజు రోజుకు వేసవి వినోదాన్ని పంచుతోంది. ఇందులో భాగంగా నేడు 'ఢిల్లీ డేర్ డెవిల్స్-హైదరాబాద్ సన్ రైజర్స్' జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో విజయం సాధిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విశేషమేమిటంటే, నేటి ఆటలో సెహ్వాగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న రాత్రి 'పుణె వారియర్స్-రాజస్థాన్ రాయల్స్' కు మధ్య జరిగిన మ్యాచ్ లో పుణె జట్టు విజయం సాధించి బోణి కొట్టింది.