: టీమిండియాకు రవిశాస్త్రి అమూల్యమైన సలహా!


ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పరిస్థితులను సద్వినియోగపర్చుకోవడంపై దృష్టిపెట్టాలని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచిస్తున్నాడు. ఫామ్ కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ ను లక్ష్యంగా చేసుకుంటే విజయం పెద్ద కష్టం కాబోదని సలహా ఇచ్చాడు. 1986లోనూ అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ డేవిడ్ గోవర్ ను టార్గెట్ చేసి తామిలాగే విజయం సాధించామని రవిశాస్త్రి గుర్తు చేశాడు.

ఆ సిరీస్ తొలి టెస్టులో గోవర్ ను స్వల్ప స్కోర్లకు పెవిలియన్ దారి పట్టించామని, తద్వారా అతనిపై ఒత్తిడి పెరిగిపోయిందని వివరించాడు. అటుపై ఆ సిరీస్ తమ వశమైందని, గోవర్ కెప్టెన్సీ ఊడిందని తెలిపాడు. ఇప్పుడు కుక్ కూడా గత 24 ఇన్నింగ్స్ లలో ఒక్క సెంచరీ కూడా నమోదుచేయలేక సతమతమవుతున్నాడని, ఇంగ్లండ్ పై గెలిచేందుకు ఇదే అదను అని ఈ మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు.

కాగా, గతంలో భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూ ఇదే పరిస్థితి ఎదురైందని రవిశాస్త్రి చెప్పాడు. కెప్టెన్సీ ఒత్తిడి సచిన్ బ్యాటింగ్ పై పడిందని వివరించాడు.

  • Loading...

More Telugu News