: ఆంధ్రులిచ్చిన షాక్ తో వ్యవసాయం చేసుకుంటున్న కోట్ల
ఆంధ్రప్రదేశ్ ప్రజలిచ్చిన తీర్పుతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యవసాయానికి పరిమితమయ్యారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు సాధారణ జీవితానికి పరిమితమయ్యారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని వదులుకోలేదని అన్నారు. కర్నూలు జిల్లా లద్దగిరి సమీపంలోని వెల్దుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలోని 50 ఎకరాల మామిడి తోటలో 25 రకాల మామిడి పండ్లను పండిస్తున్నానని తెలిపారు. గతంలో రెండు ఆవులను కొన్నానని, ఇప్పడు వాటి సంఖ్య 100కి చేరిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటుందని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.