: ఏది బెస్టు... అత్తారింటికి దారేదా?, మిర్చా?, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టా?
ఫిలింఫేర్ అవార్డుల బరిలో తెలుగు సినిమాలు గట్టి పోటీనిస్తున్నాయి. ఈసారి తెలుగు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో బరిలో నిలిచాయి. 2013 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ అవార్డుల్లో పోటీ పడుతున్న తెలుగు సినిమాల వివరాలు వెల్లడించింది.
ఉత్తమ సినిమా విభాగంలో అత్తారింటికి దారేది, గుండెజారి గల్లంతయ్యిందే, మిర్చి, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఉయ్యాల జంపాల సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఉత్తమ దర్శకుడు విభాగంలో కొరటాల శివ (మిర్చి), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో...), త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), విజయ్ కుమార్ కొండా (గుండె జారి గల్లంతయ్యిందే), విరించి వర్మ (ఉయ్యాల జంపాల) పోటీ పడుతున్నారు.
ఇక ఉత్తమ నటుడిగా మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో...), నితిన్ (గుండె జారి...), పవన్ కల్యాణ్ (అత్తారింటికి...), ప్రభాస్ (మిర్చి), రామ్ చరణ్ (నాయక్) పోటీ పడుతున్నారు.
ఉత్తమ నటి విభాగంలో అనుష్క (మిర్చి), నందితా రాజ్ (ప్రేమకథాచిత్రమ్), నిత్యా మీనన్(గుండె జారి...), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్) పోటీ పడుతున్నారు.
సహాయ నటుడు విభాగంలో స్టార్ హీరో వెంకటేష్ (మసాలా), బ్రహ్మాజీ (వెంకటాద్రి), ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో...), సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి), సునీల్ (తడాఖా) పోటీ పడుతున్నారు.
ఉత్తమ సహాయనటిగా అంజలి (సీతమ్మ...), లక్ష్మీ మంచు (గుండెల్లో గోదారి), నదియా (అత్తారింటికి దారేది), ప్రణీత (అత్తారింటికి దారేది), పునర్నవి (ఉయ్యాల జంపాల) పోటీ పడుతున్నారు.
ఉత్తమ గేయ రచయితలుగా అనంత శ్రీరామ్, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, విశ్వ పోటీ పడుతున్నారు.
ఉత్తమ గాయనీ గాయకులుగా దలేర్ మెహందీ, కైలాష్ ఖేర్, రంజిత్, శంకర్ మహదేవన్, సుచిత్ సురేశన్, చిన్న పొన్ను, చిత్ర, గీతా మాధురి, ఇందు నాగరాజ్, శ్రేయ ఘోషల్ పోటీ పడుతున్నారు. ఇందులో గీతా మాధురి తప్ప మిగిలిన వారంతా పరభాషా గాయనీ గాయకులే కావడం విశేషం.