: కాంగ్రెస్ కు నోటీసు ఇవ్వనున్న ఆదాయపన్ను విభాగం
నేషనల్ హెరాల్డ్ భూమి కేసులో త్వరలో కాంగ్రెస్ పార్టీకి ఆదాయపన్ను విభాగం నోటీసు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీకి చెందిన సదరు భూమికి పన్ను రాయితీ ఎందుకు ఉపసంహరించుకోకూడదో వివరించాలని అడగనుంది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 26న సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.