: సిమెంట్ కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించిన క్రిడాయ్
జులై 5 నుంచి 12వ తేదీ వరకు సిమెంట్ కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించామని క్రిడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి చెప్పారు. పెంచిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సిమెంట్ ధరలు తగ్గే వరకూ వ్యక్తిగత నిర్మాణాలను కూడా ఆపివేయాలంటూ క్రిడాయ్ సూచించింది. సిమెంట్ ధరలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శేఖర్ రెడ్డి కోరారు. సిమెంట్ ధరలకు అడ్డుకట్ట వేయకపోతే నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.