: చాలా ప్రియమైన వ్యక్తే నన్ను బెదిరించి, అవమానించి, దూషించాడు: ప్రీతీజింటా


వ్యాపారవేత్త, మాజీ ప్రియుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతీజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తానెందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందో, కేసు ఎందుకు పెట్టిందో సవివరంగా తన ఫేస్ బుక్ లో తెలిపింది. "నా సాక్ష్యాన్ని స్ట్రెయిట్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. పోలీసుల చేత నేనెందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను? ఎందుకంటే, కొన్నేళ్ల బెదిరింపుల తర్వాత నాకు మరో అవకాశం లేదు కనుక. శారీరక హింస లేదా దురుసు ప్రవర్తనను ఏ పురుషుడైనా, స్త్రీ అయినా... సెలబ్రిటీ అయినా కాకపోయినా సహించలేరు! అయితే, ఇందులో నా తప్పేంటంటే స్త్రీని కావడమే. ఈ సమయంలో నాకు చాలా ప్రియమైన వ్యక్తి నన్ను బెదిరించి, అవమానించి, దూషించాడు" అని ప్రీతీ వివరించింది.

  • Loading...

More Telugu News