: సత్యదేవుని సన్నిధిలో నిత్యాన్నదాన పథకం ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్పతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం చినరాజప్ప మాట్లాడుతూ... త్వరలో పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్, ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు.