: ఏలూరును రాజధాని చేయాలి: పీతల సుజాత
ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరానని గనులు, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఏలూరులో ఆమె మాట్లాడుతూ, ఇసుక తవ్వకాలపై నూతన పాలసీ తీసుకొస్తామని తెలిపారు. పిల్ల కాల్వలలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమిస్తే పీడీపీపీ యాక్టు, ఐపీసీ 3, 7, 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా అధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.