: ఇలా చేస్తే... మీ ‘హృదయం’ పదిలం!
ఇటీవల సంభవిస్తున్న మరణాల్లో... అత్యధికులు గుండెజబ్బుల వల్లే చనిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మరి, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ‘హృదయాన్ని’ పది కాలాల పాటు కాపాడుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
రోజూ గుప్పెడు బాదంపప్పు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బాదంపప్పులోని విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న ప్లేవనాయుడ్లు... రక్తప్రసరణను సాఫీగా ఉంచేలా చేస్తాయని పరిశోధనలో తేలింది. దీని వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆస్టన్ వర్శిటీ ప్రొఫెసర్ హెలెన్ గ్రిఫిత్ తెలిపారు. ఈ అధ్యయనం కోసం... యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులకు రోజు వారీ ఆహారంలో 50 గ్రాముల బాదంపప్పును ఉంచారు. దాంతో వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు.