: ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే...!
ముఖంపై ఏర్పడే నల్లమచ్చలు (బ్లాక్ హెడ్స్) చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులనైతే ఈ తరహా సమస్యలు వేధిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మొటిమలు ఏర్పడ్డాక... ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి వీటిని ఎలా తొలగించుకోవాలి? అనే దానికి చిన్న చిట్కా ఇదిగో...
దాల్చిన చెక్కను పొడి చేసి దానిలో తేనెను కలపాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు నల్లమచ్చలపై రాయాలి. ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా పోతాయి. ఇదే పేస్ట్ లో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపితే ముఖంపై ఉండే మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి.
గాయాలకు మందుగా పసుపును మనం వాడుతుంటాం. పసుపు బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. పసుపును రెండు స్పూన్ల పుదీనా రసంలో కలిపి పేస్ట్ లా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి. పేస్ట్ ఆరిపోయిన తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజులు చేస్తే మచ్చలు మటు మాయం!