: సినీ నటి ఇంట్లోకెళ్లి మరీ వేధించిన నటుడు


వర్థమాన సినీ నటిని వేధించిన సహనటుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాదులోని వెంకటగిరిలో నివసించే యువతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తోంది. సినీ నటుడు అల్లా భక్ష్ కొంత కాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో చొరబడి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించసాగాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News