: వాషింగ్టన్ లో శవమై తేలిన గుంటూరు యువకుడు!
అమెరికాలో రెండు వారాల క్రితం అదృశ్యమైన తెలుగు యువకుడు శరత్ కుమార్ మిస్టరీ వీడింది. వాషింగ్టన్ డీసీ నగరంలో నయాగర జలపాతం దగ్గర శరత్ మృతదేహం లభ్యమైంది. ఇది శరత్ కుమార్ దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తించేందుకు వీలుగా గుంటూరులోని బంధువులకు సమాచారం అందించారు. వాషింగ్టన్ నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శరత్ కుమార్ మార్చి 31న స్నేహితులతో కలిసి నయాగర జలపాతానికి వెళ్లాడు. అప్పటి నుంచీ అతడి ఆచూకీ లేదు. అయితే ఇతడు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడడం వల్ల ప్రాణాలు కోల్పోయాడా? లేక మరేదైనా కారణమా? అన్నదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.