: భారత్ పై విషం కక్కుతున్న ఐఎస్ఐఎస్


ఇరాక్ లో కొత్తగా పుట్టుకొచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్-షామ్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాద సంస్థ భారత్ పై విషం కక్కుతోంది. పలు దేశాలపై యుద్ధం ప్రకటిస్తూ, ఆ హిట్ లిస్ట్ లో భారత్ నూ చేర్చింది. రంజాన్ సందర్భంగా ఐఎస్ఐఎస్ కమాండర్ ఇబ్రహీం అవ్వాద్ అల్-బద్రి ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్, చైనా వంటి దేశాల్లో ముస్లింల హక్కులను ఉద్దేశపూర్వకంగా హరించివేశారని ఆరోపించారు.

"ఖైదీలు సాయం కోసం మౌనంగా రోదిస్తున్నారు... వితంతువులు, అనాథలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, తమ పిల్లలను కోల్పోయిన తల్లులు విలపిస్తున్నారు. మసీదులను భ్రష్టుపట్టిస్తూ, పవిత్రస్థలాలను రక్తసిక్తం చేస్తున్నారు " అని బద్రి తీవ్రస్వరంతో ప్రసంగించారు. ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో పాకిస్థాన్, ఈజిప్టు, ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలూ ఉండడం గమనార్హం. కాగా, భారత్ కూడా తమ టార్గెట్టేనని ఐఎస్ఐఎస్ పేర్కొనడంతో ఇరాక్ లో ఉన్న వేలాదిమంది భారతీయుల భద్రత ప్రశ్నార్థకమైంది.

  • Loading...

More Telugu News