: 'ఎన్' కన్వెన్షన్ హాల్ విషయంలో హైకోర్టులో ముగిసిన విచారణ
సినీ నటుడు నాగార్జునకు చెందిన హైదరాబాదులోని హైటెక్ సమీపంలో ఉన్న 'ఎన్ కన్వెన్షన్' హాల్ విషయంలో హైకోర్టులో రెండు రోజుల నుంచి కొనసాగుతున్న విచారణ ముగిసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ముందు నోటీసులు ఇచ్చాకే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకానీ నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టవద్దని చెప్పింది. కన్వెన్షన్ సమీపంలో తుమ్మిడి చెరువు ఎఫ్ టీఎల్ (సరిహద్దులు)ను నిర్దేశించాలని సూచించింది.