: వీడి బుద్ధి మారదు!


హఫీజ్ సయీద్... 2008 ముంబయి మారణహోమానికి ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా తాజా ప్రతిరూపం జమాత్ ఉద్ దవా అధినేత. అతడిని అప్పగించమని పాకిస్థాన్ ను ఎన్నిమార్లు కోరినా ఫలితం శూన్యం. వారిచ్చే జవాబు... అతడి ఆచూకీ లభించడంలేదనే! కానీ, ఈ ముష్కరుడు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాడు, ఊరేగింపులు నిర్వహిస్తాడు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ఎన్ని చేయాలో అన్నీ చక్కబెడతాడు!

తాజాగా, రాజస్థాన్ సమీపంలోని పాక్ సరిహద్దు గ్రామాల్లో ఇతడు పర్యటిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇస్లాంకోట్, మీర్పూర్ ఖాస్, మిత్తి, ఖేర్పూర్ ప్రాంతాల్లో హఫీజ్ తీవ్రవాద రిక్రూట్ మెంట్లకు తెరదీసినట్టు సమాచారం. ఈ రిక్రూట్ మెంట్ క్యాంపులకు తమ పిల్లలను పంపాల్సిందిగా హిందువులను ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News