: సునంద మరణంపై సమగ్ర సమాచారం ఇవ్వండి: కేంద్ర వైద్య మంత్రి హర్షవర్ధన్ ఆదేశం
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మరణంపై కేంద్ర వైద్య శాఖ దృష్టి సారించింది. సునంద మృతి సహజమైనదంటూ రిపోర్ట్ ఇవ్వాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ అధిపతి డాక్టర్ గుప్తా చేసిన ఆరోపణలపై కేంద్ర వైద్య మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. వెంటనే సునంద మృతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఎయిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు.