: సలహాలు ఇవ్వొద్దు, ఏంచేయాలో నాకు తెలుసు: కోహ్లీ


మాజీ క్రికెటర్లు తనకు సలహాలు ఇవ్వడంపై టీమిండియా యువకెరటం విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఎవరి సలహాలు తనకు అక్కర్లేదని, ఏం చేయాలో తనకు బాగా తెలుసని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ బీసీసీఐ వెబ్ సైట్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరికోసమో నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డాడు.

"నా ప్రదర్శన పట్ల నేనేమనుకుంటున్నాన్నది నాకు ముఖ్యం. ఇతరులు ఏమన్నా పట్టించుకోను. ఇంగ్లండ్ తో జరగబోయేది ప్రాధాన్యత ఉన్న సిరీస్ అని నాకూ తెలుసు. 'ఇంగ్లండ్ తో సిరీస్ లో కోహ్లీ రాణించాలి, పరుగులు చేయాలి, ఈ సిరీస్ అతనికో పరీక్ష' అంటూ కొందరు సలహాలిస్తున్నారు. అలాంటివి నాకవసరంలేదు. ఇలాంటి సలహాలతో పనిలేకుండానే సత్తా చాటగలను" అని కోహ్లీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News