: మన బౌలర్లను చితకబాదారు!


ఇంగ్లండ్ పర్యటనలో భారత బౌలర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీసెస్టర్ షైర్ తో జరిగిన తొలి ప్రాక్టీసు మ్యాచ్ నుంచి మనవాళ్ళు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడంలేదు. తాజాగా, డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ డెర్బీ బ్యాట్స్ మెన్ ఒక్కరోజులోనే 326 (5 వికెట్లకు) పరుగులు చేశారు. డర్స్ టన్ 95, గాడిల్ మాన్ 67*, స్లేటర్ 54, హోసీన్ 53* టీమిండియా బౌలర్లను ఆటాడుకున్నారు. జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్ ఇషాంత్ శర్మ ఒక్క వికెట్టూ తీయలేక ఉసూరుమనిపించాడు. పార్ట్ టైమ్ బౌలర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసి పరువు నిలిపాడు.

  • Loading...

More Telugu News