: భర్తపై ఇద్దరు భార్యల దాడి


భూవివాదం ఓ కాపురంలో కలతలు రేపింది. కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు భార్యలు తెగించారు. మారణాయుధాలు చేతబట్టారు. వివరాల్లోకెళితే... కర్ణాటకలోని కుక్కలహళ్ళి గ్రామంలో నివసించే నారాయణస్వామికి ఇద్దరు భార్యలు. వారి పేర్లు యశోద, గంగమ్మ. కాగా, స్వామికి అతడి సోదరుడు నరసయ్యలకు భూమి విషయంలో వివాదం ఉంది. రెండ్రోజుల క్రితం ఈ సమస్యను గ్రామపెద్దల సమక్షంలో పరిష్కరించుకున్నారు. అయితే, గ్రామపెద్దల తీర్పు ఇద్దరు భార్యలకు నచ్చలేదు. పెద్దల తీర్పుకు అంగీకరించవద్దని భార్యలిద్దరూ స్వామికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన వారిద్దరూ భర్త కళ్ళల్లో కారంచల్లి గొడ్డళ్ళతో దాడికి దిగారు.

ఈ దాడిలో స్వామి చేతివేళ్ళు తెగిపోయాయి. అంతేగాకుండా, మర్మాంగంపైనా గొడ్డలి వేటు పడింది. దీంతో, అక్కడి నుంచి అన్న ఇంటి వద్దకు వచ్చి పడిపోయాడు. నరసయ్య తమ్ముడిని ఆసుపత్రిలో చేర్పించి హోసహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News