: నేడు ఢిల్లీకి బయల్దేరుతున్న కిషన్ రెడ్డి... తెలంగాణకు న్యాయమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా వెళుతున్నారు. ఈ నెల 7న పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత న్యాయం జరిగేలా కేంద్రాన్ని అర్థించడమే పర్యటన ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది.