: మాజీ ఎమ్మెల్యే వెంకటరామరాజు కన్నుమూత
రాజోలు మాజీ శాసనసభ్యుడు అల్లూరి వెంకటరామరాజు (85) కన్నుమూశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని తన నివాసంలో గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగుతాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో సీపీఐ సీనియర్ నేతగా మంచి పేరు సంపాదించుకున్నారు అల్లూరి. ఆయనకు స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొన్న చరిత్ర ఉంది. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.