: నంద్యాల మున్సిపాలిటీలో 11 మందిపై సస్పెన్షన్ వేటు
కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆస్తిపన్ను వసూలులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించారు. బాధ్యులైన 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ పురపాలక సంఘ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.