: పొరుగు పాలపుంతలో ఓ భారీ నీలి తార


మన సౌరకుటుంబం ఉండే పాలపుంతలో కాకుండా, దూరంగా ఉన్న మరో నక్షత్రమండలంలో ఓ భారీ నీలి నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 55 మిలియన్‌ సంవత్సరాల కిందట ఇది ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. నాసాలోని గ్యాలెక్స్‌ సుబారు టెలిస్కోప్‌లను ఉపయోగించి చేసిన ఈ పరిశోధనలకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆనంద్‌ హోతా సారథ్యం వహించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త నీలి నక్షత్రం.. ఐసీ3418ను కనుగొన్నారు. 2006 నుంచి వివిధ టెలిస్కోపుల ద్వారా సేకరించిన సమస్త సమాచారాన్ని కూడా క్రోడీకరించారు. మన సౌరకుటుంబం ఉండే పాలపుంతలో కూడా భవిష్యత్తులో కొత్త నక్షత్రాలను కనుగొనడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News