: మహిళలు నడుపుతున్న ఆన్ లైన్ జర్నల్ కు... జర్మనీ అవార్డు
ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా జర్నలిస్టులు నడుపుతోన్న ‘ఖబర్ లెహరియా’ అనే ఆన్ లైన్ జర్నల్ కు జర్మనీ ప్రభుత్వం ఇచ్చే ‘ది బెస్ట్ యాక్టివ్ ఆన్ లైన్ ఎడిషన్’ అవార్డు దక్కింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన 40 మంది మహిళా జర్నలిస్టులు దీన్ని నడుపుతున్నారు. తొలుత ఎనిమిది పేజీలతో వారాంతపు పత్రికగా వచ్చిన ఈఎ జర్నల్ తర్వాత ఆన్ లైన్ ఎడిషన్ ను కూడా ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత మహిళల కోసం వాడుక భాషలో ఈ పత్రిక ప్రచురితమవుతోంది. కాగా, ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పత్రిక ఎడిటోరియల్ కో-ఆర్డినేటర్ పూర్వి భార్గవ్ అన్నారు. ప్రతి వారం ఉత్తరప్రదేశ్, బీహార్ లోని 600 గ్రామీణ ప్రాంతాల్లో 6000 కాపీలను పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు.