: అతడు మృత్యుంజయుడు!
అవును, అతడు మృత్యుంజయుడు. చెన్నైలో కూలిన భవనం శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత... ఇవాళ సాయంత్రం ఒడిశాకు చెందిన ఓ కార్మికుడిని సహాయక సిబ్బంది రక్షించారు. దాంతో ఇప్పటివరకు గాయాలతో బయటపడిన వారి సంఖ్య 27కి చేరింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.