: నాగార్జున 'ఎన్' కన్వెన్షన్ పై రేపటి వరకు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు


సినీ నటుడు నాగార్జునకు చెందిన 'ఎన్' కన్వెన్షన్ హాల్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జీహెచ్ఎంసీని ఆదేశించింది. కాగా, కన్వెన్షన్ హాల్ కు సంబంధించి ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ మార్కింగ్ చేయడంపై నాగార్జున తరపు న్యాయవాదులు కోర్టు ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. కూల్చివేసే పరిస్థితి వస్తే కచ్చితంగా నోటీసులు ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News