: 'గెలవండి... అంతరిక్షంలోకి తీసుకెళతాం'
నెదర్లాండ్స్ జట్టుకు బంపర్ ఆఫర్! బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న సాకర్ వరల్డ్ కప్ లో టైటిల్ గెలిస్తే జట్టంతటినీ అంతరిక్ష యాత్రకు తీసుకెళతామని డచ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రకటించింది. వరల్డ్ కప్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్ చేరినా కప్ గెలవడంలో మాత్రం డచ్ వీరులు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఆఫర్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని డచ్ ఏరోస్పేస్ కంపెనీ వర్గాలు అంటున్నాయి.