: 2011 ముంబయి పేలుళ్ల ఘటనలో భత్కల్, అక్తర్ పై అభియోగాలు
2011 ముంబయి పేలుళ్ల ఘటనలో ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని అనుచరుడు అసదుల్లా అక్తర్ పై మహారాష్ట్ర పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు ముంబైలోని ప్రత్యేక కోర్టులో మూడు వందల పేజీల అనుబంధ చార్జిషీట్ ను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ దాఖలు చేసింది. ఈ పేలుళ్ల ఘటనలో భత్కల్ ను ప్రధాన కుట్రదారుగా పేర్కొంది. నాడు ముంబయిలో మూడు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 21 మంది మృతి చెందగా, 141 మందికి గాయాలయ్యాయి.