: ఆయుర్వేద వైద్య విధానాన్ని అభివృద్ధి చేస్తాం: రాజయ్య
వరంగల్ జిల్లాలో జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయుర్వేద వైద్య విధానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయుర్వేద కళాశాలల్లో సీట్ల భర్తీకి కృషి చేస్తామని ఆయన అన్నారు. వైద్య మండలితో సంప్రదించి సీట్లు భర్తీ అయ్యేలా చూస్తామని మంత్రి చెప్పారు.