: సికింద్రాబాదు-హుబ్లీ మధ్య 26 ప్రత్యేక రైళ్లు


ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాదు - హుబ్లీ మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాదు-హుబ్లీ ట్రై వీక్లీ ఎక్స్ ప్రెస్ (నెం. 07320) సికింద్రాబాదు నుంచి... ప్రతి బుధ, శుక్ర, శనివారం సాయంత్రం 4 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు హుబ్లీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో హుబ్లీ-సికింద్రాబాదు ట్రై వీక్లీ ఎక్స్ ప్రెస్ (నెం. 07319) హుబ్లీ నుంచి ప్రతి మంగళ, గురు, శనివారం రోజుల్లో రాత్రి 8.50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాదు చేరుతుంది.

  • Loading...

More Telugu News