: 'డాక్టర్స్ డే' నాడు లంచం పుచ్చుకున్నాడీ వైద్యుడు!
'డాక్టర్స్ డే' (జూలై 1) అంటే వైద్యులకు పర్వదినంగానే భావించాల్సి ఉంటుంది. అయితే, రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ వైద్యుడు ఇవేవీ లెక్కచేయకుండా లంచాలే పరమావధిగా జీవిస్తూ ఏసీబీ వలకు చిక్కాడు. నేడు 'డాక్టర్స్ డే' అని కూడా మర్చిపోయి ఓ రోగి నుంచి రూ.1500 మెక్కే ప్రయత్నం చేశాడు. జైపూర్ లోని ఆర్బీఎం ఆసుపత్రిలో అనిల్ గుప్తా డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మొలలకు శస్త్రచికిత్స చేసేందుకు గాను జగన్ సింగ్ అనే రోగి నుంచి గుప్తా లంచం కోరారు. తొలుత వెయ్యి రూపాయలిచ్చిన జగన్ సింగ్ అనంతరం డాక్టర్ నివాసంలో మిగిలిన రూ.500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.