: బాంబు బెదిరింపుతో ఢిల్లీ-కోచి విమానం ఆలస్యంగా వెళ్ళింది!
సోమవారం అర్థరాత్రి కోచి నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో, విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశారు. భద్రతా సిబ్బంది, బాంబు స్వ్కాడ్ కలసి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్థారించారు. దాంతో, 164 మంది ప్రయాణికులున్న ఈ విమానం తిరిగి ప్రయాణాన్ని కొనసాగించింది.