: లాలూ పిటిషన్ ను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచిలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఇతర కేసుల్లో తనపై కొనసాగుతున్న విచారణను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఈ స్కాంకు సంబంధించిన మూడు కేసుల్లో తనపై జరుగుతున్న విచారణను కొట్టి వేయాలని లాలూ పిటిషన్ లో కోరారు. ఇప్పటికే ఈ స్కాంలోని ఓ కేసులో దోషిగా రుజువైన లాలూకు న్యాయస్థానం ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు.