: ఆ విషయంలో పిల్లలు పిడుగులే!
పసిపిల్లలు ఒక కొత్త భాషను నేర్చుకున్నంత సులువుగా పెద్దవాళ్లు కూడా నేర్చుకోలేరు. ఎల్కేజీ కుర్రవాడికి, పాతికేళ్ల తెలుగు యువకుడికి ఒకేసారి స్పోకెన్ ఇంగ్లిష్ ప్రారంభిస్తే.. కుర్రాడు నేర్చుకోవడం వేగంగా జరుగుతుంది. భాషల అభ్యాసంలో దీనికి వేర్వేరు కారణాలున్నాయి.
అయితే పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని చార్లెస్ యాంగ్ బృందం పసిపిల్లలు భాష నేర్చుకునే అంశం మీదనే పరిశోధనలు చేసిందిట. అందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. తమకు తెలిసేవి చాలా తక్కువ పదాలే అయినప్పటికీ, రెండేళ్ల వయసు నుంచి కూడా పూర్తి వ్యాకరణ సహితంగా తప్పుల్లేకుండా మాట్లాడేందుకు పిల్లలు ప్రయత్నిస్తారట. ఆ వయసులోని భాష నేర్చుకోవడంలో పర్ఫెక్షన్కు యత్నిస్తుంటారన్నట్లుగా అధ్యయనం ఫలితాలు తేల్చాయి.