: సైబర్ నేరాల్లో దూసుకుపోతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్!
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేరాలపై అధ్యయనం చేసినప్పుడు... ఈ తరహా నేరాలు మహారాష్ట్రలోనే అత్యధికంగా జరుగుతున్నాయని తేలింది. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (విభజనకు ముందు), కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. సైబర్ నేరాల నమోదులో ఈ మూడు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే, నేరాలతో పాటు ఈ మూడు రాష్ట్రాల్లో ఐటీ, ఐటీ సంబంధ పరిశ్రమల నుంచి ఆదాయం కూడా ఎక్కువగానే (దేశంలో సుమారు 70 శాతం) వస్తోంది.
2013లో మహారాష్ట్రలో 681 సైబర్ నేరాలు నమోదయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ (విభజనకు ముందు)లో 635 సైబర్ నేరాలు నమోదు కాగా, కర్ణాటకలో 513 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ 372 నేరాలతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. 2012తో పోలిస్తే, దేశంలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. ఇక, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. 2013లో ఢిల్లీలో 131 సైబర్ నేరాలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది.