: ఇవాళ డాక్టర్స్ డే... శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య భారత్ కోసం కృషి చేస్తున్న వైద్యులకు ఆయన అభినందనలు తెలిపారు. భారతదేశంలో ప్రతి ఏటా జులై 1వ తేదీన ‘డాక్టర్స్ డే’ జరుపుతున్న విషయం విదితమే.
ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జులై 1, 1882లో జన్మించారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. డా. రాయ్ తన 80వ ఏట అదే తేదీన (జులై 1, 1962) మరణించారు. భారత ప్రభుత్వం ఆయనకు 1961వ సంవత్సరంలో 'భారతరత్న' అవార్డును ఇచ్చి సత్కరించింది. డాక్టర్ రాయ్ ను గౌరవిస్తూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా 'డాక్టర్స్ డే' ను జరుపుతోంది.