: ఎంతైనా మగాళ్లు కొంచెం తేడానే!
అనుబంధాలకు విలువ ఇచ్చే విషయంలో ఎవరు ఎక్కువ ఎమోషనల్ గా స్పందిస్తారనే సంగతి ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే స్థూలంగా చూసినప్పుడు స్త్రీలు కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారని, పురుషులు నిష్కర్షగా వ్యవహరిస్తారని ఓ తాజా అధ్యయనం చెబుతోంది.
ఈ అధ్యయనంలో స్త్రీ పురుషులకు ఒక ప్రశ్నావళి ఇచ్చారు. వారి సమాధానాల్ని బట్టి విశ్లేషించారు. ప్రేమ, దాని ద్వారా వచ్చే సాంత్వన, అవగాహన, కష్టాల్లో తోడు గురించిన నిశ్చింత.. ఇవన్నీ ఇద్దరిలో ఒకేలా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పురుషులు కొంచెం తేడాగా వ్యవహరిస్తారని, నిష్కర్షగా ఉంటారని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. పైగా పురుషులు స్నేహితులకి, ప్రియురాలికి ఇచ్చే ప్రయారిటీలు కూడా వేర్వేరుగా ఉంటాయిట.